Tuesday, 3 November 2026

ఎరువుల ధరలు పెంచం:కేంద్ర మంత్రి హన్స్ రాజ్ గంగారాం

ఆదిలాబాద్:ఎరువుల ధరలను 2019 వరకు పెంచబోమని కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారాం తెలిపారు. ఆదిలాబాద్ పర్యటనలో ఉన్న మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ లో7 25 వేల జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశవ్యాప్తంగా మూతపడిన ఎరువులు, రసాయనిక ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తామని, యూరియా ధరలు పెంచమని హామీ ఇచ్చారు. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఎన్డీయే పాలన ఏడాది పూర్తి అయిన సందర్భంగా బీజేపీ నేడు నిర్మల్‌లో బహిరంగ సభను ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేడు ఉదయం మంత్రి ఆదిలాబాద్ చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *