ఎల్ఓసి మంజూరు చేయించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన ఆర్.మల్లేశ్వరి కాలుకు సంబంధించిన అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ సహాయం కొరకు మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంప్రదించారు. స్పందించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించారు. ఎల్ ఓ సి మంజూరు పత్రాన్ని ఆదివారం మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు వారికి హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు

తాజావార్తలు