వరద ముంపు ప్రాంత బాధితులకు శాశ్వత పరిష్కారం చూపించాలి – మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలo చిన్న ఓదాల, గోపాల్పూర్ గ్రామాలలో వరద ముంపు ప్రాంతలలో మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి , బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సునీల్ రెడ్డి ఆదివారం పర్యటించి నష్టపోయిన రైతులను ఓదార్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మా మంథని ప్రాంతం రైతుల నోట్లోమట్టి కొట్టారు.. ప్రాజెక్టు వల్ల మంథని ప్రాంతానికి ఎటువంటి మేలు జరగకపొగ తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని అన్నారు. రైతుల పంట పొలాలలో ఇసుక మేటలు నిలిచి పంటకు పనికి రాకుండా పోయాయి అని, కాలేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్న ఇంత వరకు ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదని ఆరోపించారు . ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు కంటి తుడుపు చర్యలు మానుకొని శాశ్వత పరిష్కారం చూపించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ది చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వినర్ నాంపల్లి రమేష్, మండల అధ్యక్షులు విరబోయిన రాజేందర్, సీనియర్ నాయకులు అలవేణి సమ్మయ్య, దికొండ రవి, అల్లే రాజయ్య, బీజేవైఎం మంథని పట్టణ అధ్యక్షులు బుర్ర రాజు తదితరులు పాల్గొన్నారు.