ఎల్ఓసి మంజూరు చేయించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన ఆర్ రాహుల్ కాలు సర్జరీ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రి లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ సహాయం కొరకు మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి తెలుపగా సీఎం సహాయక నిధి నుంచి వైద్య ఖర్చుల నిమిత్తo లక్ష రూపాయలు ఎల్ఓసి మంజూరు చేయించారు. ఈ ఎల్ ఓ సి మంజూరు పత్రాన్ని మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు సోమవారం వారికి హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు.