ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే.

ఎల్ఓసి మంజూరు పత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే.
నెన్నెల,సెప్టెంబర్20,(జనంసాక్షి)
నెన్నెల మండలం నందులపల్లికి చెందిన బోయిని రమేష్ అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంగళవారం వారి కుటుంబ సభ్యులను కలిసి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. చికిత్స కోసం ఆర్థిక పరిస్థితి సరిగా లేదని తెలుసుకున్న ఆయన ₹ లక్షా యాభై వేల రూపాయల ఎల్ఓసి మంజూరు పత్రాన్ని రమేష్ సోదరుడు మల్లేష్ కు అందజేసి ఆదుకున్నాడు. ఆయన వెంట టీఆరెస్ నాయకులు సింగతి శ్రీనివాస్, అశోక్ ఉన్నారు.