Tuesday, 3 November 2026

ఎల్బీనగర్‌ పరిధిలో కార్డెన్‌ సర్చ్‌

హైదరాబాద్‌,మే30(జ‌నం సాక్షి): చైతన్యపురి లిమిట్స్‌ లోని మున్సిపల్‌ కాలనీ , విద్యుత్‌ నగర్‌, వికాస్‌ నగర్‌ లో ఎల్బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. కార్డన్‌ సెర్చ్‌లో ముగ్గురు ఏసీపీలు,19 మంది ఇన్స్పెక్టర్‌లు , 36 మంది సబ్‌ ఇన్సిపెక్టర్లు ,45 మంది మహిళా పోలీసులు… మొత్తం 330 మంది పోలీసులు పాల్గొన్నారు.ఈ తనిఖీలలో ఆరుగురుఅనుమానితులను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ తెలిపారు.  పదకొండు ఆటోలు, ముప్పై ద్విచక్ర వాహనాలు , తొమ్మిది సిలెండర్లు , పన్నెండు మద్యం బాటిల్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ తనిఖీలతో ప్రజలలలో భద్రతా భావం పెరుగుతున్నదని , ప్రజల నుంచి కుడా మంచి సహకారం,స్పందన లభిస్తున్నదని ఎల్బీనగర్‌ డీసీపీ పేర్కొన్నారు.