Tuesday, 3 November 2026

ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ కి రాఖీ కట్టిన మహిళలు

ఎల్బీ నగర్( జనం సాక్షి  ) రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి  ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ కి  తమ సోదరీమణి  జ్యోతి , బ్రహ్మకుమారీలు ,  గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ అధ్యక్షురాలు  సరస్వతి, పలువురు తెరాస పార్టీ  సోదరీమణులు గౌరీ ,రజనీ, పద్మ, లక్ష్మి , ప్రమీల, రేణుక, గంగ, తదితరులు పాల్గొని రాఖీ కట్టారు.    .ఈ సందర్బంగా రామ్మోహన్ గౌడ్ గారు  వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్బంలో బి ఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ తదితరులున్నారు .