రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్న కర్ణ కంటి మంజులరెడ్డి

 హుస్నాబాద్ ఆగస్టు 12(జనంసాక్షి) హుస్నాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ లోని గోదాంగడ్డ వద్ద రాఖీ పండుగను పురస్కరించుకొని సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి  రక్షబంధన్ వేడుకకు హాజరై యువత అందరకి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా మంజులరెడ్డి  మాట్లాడుతూ… తోబుట్టువుగా భావించి ఆహ్వానించిన తమ్ముడ్లు అందరకి ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు. మంజులక్క యువసేన నమ్ముకుని ప్రయాణం కొనసాగిస్తునని, యువసేన తన బలం అనీ అన్నారు.  కష్టసుఖాల్లో మంజులక్క ఎప్పుడు  తోడుటుందని మంజులక్క యువసేన సభ్యులకు హామీ ఇచ్చారు.అనంతరం యువకులు అందరు కలిసి మంజులరెడ్డిని శాలువా తో ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమం లో కాలనీ వాసులు, సుభాష్ నగర్ యువత, మంజులక్క యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.