ఎస్సి వర్గీకరణకు పార్లమెంట్ లోబిల్లు పెట్టకుండా బీజేపీ నాయకులు మాదిగ వాడల్లోకివస్తే అడ్డుకుంటాం
గుగ్గిళ్ల పీరయ్య
బయ్యారం,జులై21(జనంసాక్షి):
బయ్యారం మండల కేంద్రంలోని స్థానిక అంబెడ్కర్ నగర్ లో ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శి మంద ఉమేష్ మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పి పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ గుగ్గిళ్ల పీరయ్య మాదిగ పాల్గొని మాట్లాడుతూ… బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సి వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మాదిగలను మోసం చేసి గద్దెనెక్కి కూర్చున్నా, ఇంతవరకు వర్గీకరణ చేయకుండా జాప్యం చేసి,హైదరాబాద్ లో విజయ సంకల్ప సభలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు, నాయకురాళ్లు ప్రధాని మోడీ ప్రసంగం సమయంలో ఎమ్మార్పీఎస్ జెండాతో నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు దాడిచేసి తలలు పగలగొట్టారని గుర్తు చేశారు.ఇప్పుడు బీజేపీ పార్టీ పల్లె పల్లెకు భరోసా పేరుతో మాదిగల గూడాలకు రావడానికి సిద్ధంగా ఉంది కనుక ఎంఎస్పి,ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు అందరు బీజేపీ నాయకులను పల్లెలకు రావడానికి ముందు ఎస్సి వర్గీకరణ బిల్లును పెట్టడానికి ఒప్పుకోవాలని, అలాగే నిరసన వ్యక్తం చేసిన మా నాయకులందరికి బేషరతుగా క్షమాపణ చెప్పేంతవరకు మాదిగ గూడాలకు బీజేపీ నాయకులని రానివ్వకూడదని పిలుపునిచ్చారు.అలాగే జిల్లాలో ఉన్న అన్ని మండలాలకు ఇంఛార్జి లుగా నియమించారు.ఈ సమావేశంలో ఎంఎస్పి మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ కత్తి వెంకన్న మాదిగ,జిల్లా నాయకులు మిరియాల శ్రీను మాదిగ, మండల నాయకులు మంద ఉమేష్ మాదిగ,మరికంటి నరేష్ మాదిగ, నాగేష్ మాదిగ,రోహిత్ మాదిగ,రోషన్ మాదిగ,తదితరులు పాల్గొన్నారు.