ఎస్సీ ఎస్టీ వసతి గృహాల సలహా కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం
జహీరాబాద్ ఆగస్టు 29 (జనంసాక్షి)
జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు కొనింటీ మాణిక్ రావు ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వసతి గృహాల సలహా కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా హాస్టల్లో విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం మౌలిక సదుపాయాలు సమస్యలు వంటి అంశాల పైన చర్చించారు.
సమావేశంలో వివిధ మండలాల ఎంపీడీవోలు, హాస్టల్ వార్డెన్ లు, ప్రిన్సిపాల్లు తదితరులు పాల్గొన్నారు.