Wednesday, 4 November 2026

ఏజెన్సీలో మావోయిస్టు కదలికలపై ఆరా

అప్రమత్తంగా ఉండాలి:మహబూబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్
కొత్తగూడ ఆగస్టు 28 జనంసాక్షి:మహబూబాబాద్  జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్  మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన కొత్తగూడ,గంగారం పోలీస్ స్టేషన్లను సందర్శించి సిబ్బందికి తగు సూచనలను చేయడం జరిగింది.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన గంగారం మండలంలోని మర్రిగూడెం,కామారం గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకం కావడం జరిగింది.ఈ సందర్భంగా ప్రజలు ఎవరూ కూడా మావోయిస్టులకు ఎలాంటి ఆశ్రయం,సహకారం అందించవద్దని మావోయిస్టులు గ్రామాల్లోకి వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాలని వారికి తగిన పారితోషకంతోపాటు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా అంచడం జరుగుతుందని తెలిపారు.అదేవిధంగా గ్రామస్తులను అడిగి స్థానిక సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గూడురు సీఐ యాసీన్,కొత్తగూడ ఎస్ఐ నగేష్,గంగారం ఎస్ఐ ఉపేందర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.