Friday, 6 November 2026

ఏజెన్సీ వ్యాధులపై అప్రమత్తం అవసరం

ఆదిలాబాద్‌,జూన్‌15(జనంసాక్షి): వర్షాకాలం ప్రారంభమైనందున వైద్యసిబ్బంది గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం రక్షణకు విస్తృతంగా పర్యటించాలని డిప్యూటీ డైరెక్టర్‌ వసంత్‌రావు అన్నారు.జిల్లాలోని ఏజెన్సీ పరిధిలోని ఎనిమిది ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల సూపర్‌వైజర్లకు పలు సూచనలు చేశారు. గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు రాకుండా ముందస్తుగా తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. దోమలు వ్యాప్తి చెందకుండా దోమల నివారణ మందు స్పే చేయాలని, ప్రతి సబ్‌సెంటర్‌ నుంచి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వరకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఎపడమిక్‌ సెల్‌(మోబైల్‌ టీం) ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వర్షాకాలం ముగిసే వరకు ఏజెన్సీలోని వైద్యసిబ్బందికి లీవ్‌లు మంజూరు చేయబోమన్నారు. అత్యవసర పరిస్థితులు ఉంటే ముందుగా సమాచారం ఇవ్వాలని సూచించారు. వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.