Thursday, 5 November 2026

ఏపీకి జరిగిన అన్యాయాన్ని సమగ్రంగా వివరించారు

– గల్లా ప్రసంగంపై చంద్రబాబు ట్వీట్‌
హైదరాబాద్‌, జులై20(జ‌నం సాక్షి) : విభజన చట్టం ప్రకారం ఆంధప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై కేంద్రం తీరును ఎండగట్టిన తెదేపా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. గల్లా ప్రసంగంపై ఆయన స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. ఆంధప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో గల్లా జయదేవ్‌ సమగ్రంగా చూపించారు. ఐదు కోట్ల మంది ఆంధప్రదేశ్‌ ప్రజల ఆకాంక్ష మేరకే మేం ఈ పోరాటం చేస్తున్నాం. ఏపీ ప్రత్యేక ¬దా కింద 2014లో ప్రధాని మోదీ ఏమైతే హావిూలు ఇచ్చారో వాటిని పూర్తి చేయమని మేం డిమాండ్‌ చేస్తున్నాం’ అని చంద్రబాబు నాయుడు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయంపై గల్లా గళమెత్తారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా గల్లా మాట్లాడుతూ విూరు ఇచ్చిన హావిూలను మరిచిపోతారా? అంటూ భాజపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.