జనంసాక్షి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో సోనియా సభను నిర్వహిస్తామని ఏపీసీసీ అధినేత రఘువీరారెడ్డి వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంట్‌లో ఒత్తిడి తీసుకురావాలని ఏపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు రఘువీరారెడ్డి, కొప్పుల రాజు, కేవీపీ రామచంద్రరావు తదితరులు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, సోనియాగాంధీని కలిసి మాట్లాడారు. ఏప్రిల్ నాటికి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కోటి సంతకాలు పూర్తి చేసి ప్రధానికి సమర్పిస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.




