ఖైరతాబాద్ : ఆగస్టు 28 (జనం సాక్షి) ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఎమ్ఎసి హైదరాబాద్ మారథాన్ 11వ ఎడిషన్‌లో పాల్గొన్న 9 వేల మంది రన్నర్లను ఉత్సాహపరిచేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మ్యూజిక్ బ్యాండ్లు, పెద్ద స్థాయి వినోదాలు రన్నర్ల స్ఫూర్తిని పెంచాయి. క్రీడా ఔత్సాహికులు, వేలాది మంది ప్రజలు, నగరంలోని అతి పెద్ద కమ్యూనిటీ స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొనడానికి మార్గం మొత్తం వరుసగా ఉన్నారు. ఎన్ఎమ్ఐడీసీ హైదరాబాద్ మారథాన్ కోర్సు అనేది ఒక ఎయిమ్స్ సర్టిఫైడ్ కోర్సు(అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మారథాన్స్ అండ్ డిస్టెన్స్ రేస్). పుందాయ్ ఎన్ఎమ్ఎసి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ దేబ్ జెండా ఊపి ప్రారంభించిన ఫుల్ మారథాన్ లో 11 వందల మంది రన్నర్లు పాల్గొన్నారు. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈఓ వీ.వైద్యనాథన్ జెండా ఊపి ప్రారంభించిన హాఫ్ మారథాన్ లో 3240 మంది రన్నర్లు పాల్గొన్నారు. ఇవి పీపుల్స్ ప్లాజా నుంచి మొదలయ్యాయి. సైబరాబాద్ డీసీపీ, ఐపీఎస్ శ్రీ టి శ్రీనివాస్ రావు ప్రభుత్వ ఉన్నతాధికారులు, కార్పరేట్ హౌసులు, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆర్గనైజింగ్ టీం సమక్షంలో జెండా ఊపి ప్రారంభించిన 10 కి రన్ లో 5 వేల మూడు వందల మందికి పైగా రన్నర్లు పాల్గొన్నారు. కేర్ హాస్పిటల్స్ 21 మెడికల్ స్టేషన్లలో 250 పారామెడికల్ సిబ్బందిని 5 పూర్తిగా అమర్చిన అంబులెన్సులు, గచ్చిబౌలి స్టేడియంలో 15 పడకల ఎమర్జెన్సీ సెటన్ని అందిస్తోంది. ఎన్ఎమ్ఐడీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుమీ డేట్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈఓ వైద్యనాథన్, ఎన్ఎమ్ఎసి హైదరాబాద్ మారథాన్ 11 వ ఎడిషన్ రేస్ డైరెక్టర్ ప్రశాంత్ మోర్పారియా చేతుల మీదుగా అందుకున్నారు. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10 కే రేస్‌లో పురుషల, స్త్రీల కటగిరీల్లో మొదటి మూడు స్థానాలు పొందిన వారి వారి బిట్ సంఖ్య, టైమింగ్ తో దిగువన ఇవ్వబడ్డాయన్నారు.




