20 రోజులలో 17 లక్షల . ఐదు తులాల బంగారం స్వాధీనం డీఎస్పీ రవీందర్ రెడ్డి సిఐ నాగరాజు
రిటైర్డ్ ఉద్యోగి లక్ష్మీనారాయణకుఊరట
ఐదుగురు నిందితుల అరెస్ట్
చాకచక్యంగా వ్యవహరించిన జోగిపేట పోలీసులు
జోగుపేట పోలీసులను అభినందించిన డిఎస్పి రవీందర్
జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ శుక్రవారం జోగుపేట సిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం లో కొన్ని నిజాలు బయటపడ్డాయి. గత 20 రోజుల క్రితం జోగుపేట పట్టణంలో రిటైర్డ్ టీచర్‌గా ఉన్న లక్ష్మీనారాయణ అనే ఇంట్లో 35 లక్షల చోరీ జరిగిన విషయం అందరికీ తెలిసింది. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మీనారాయణకు దగ్గర బంధువులైన అనంతయ్య అనే వ్యక్తి డబ్బుపై దురాశతో పన్నాగం పండి స్నేహితులైన దూదేకుల జిలాని మండల జగన్ మన్నే మచ్చందర్ లను రంగంలోకి దించారు లక్ష్మీనారాయణ రిటైర్మెంట్ కు ప్రభుత్వం నుండి వచ్చిన డబ్బులు తస్కరించాలని మీరు ఉపాయం స్పందించారు ఇందులో భాగంగా జిలాని జగన్‌లు లక్ష్మీనారాయణకు పూర్వ విద్యార్థులు అన్నట్లుగా పరిచయం చేసుకొని మరల పది రోజులకు ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం మరలా లక్ష్మీనారాయణ కలిసి మద్యం సేవించి మద్యం మత్తులో ఉన్న లక్ష్మీనారాయణకు నమ్మబల్ కి బైక్ తాళాలను తీసుకున్నారు బైక్ తలాలతోపాటు ఇంటి తాళాలు ఉండడంతో మద్యం సేవించిన స్థలంలోనే లక్ష్మీనారాయణ ఉంచి ఏపీ 23 పి 1788 బైక్ పై వచ్చి బీరువా తాళాలు తెరిచి సొమ్మును తస్కరించారు. ఆలస్యంగా విషయం గమనించిన రిటైర్ ఉద్యోగి లక్ష్మీనారాయణ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులను పట్టుకుని విచారించగా 17 లక్షల రూపాయల నగదు ఐదు తులాల బంగారాన్ని రికవరీ చేసినట్టుగా పోలీసులు తెలిపారు




