హైదరాబాద్,నవంబర్12(జనంసాక్షి): చాదర్‌ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలోని అక్బర్‌బాగ్‌లో విషాదం నెలకొంది. శ్రీసాయి అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తు నుంచి ఓ మహిళ దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని శిరీష(30)గా గుర్తించారు మానసిక స్థితి సరిగా లేకనే శిరీష ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఉదయం శిరీష ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఆమె కుటుంబ సభ్యులు గమనించి అడ్డుకున్నారు. మధ్యాహ్నం సమయంలో ఎవరూ లేకపోవడంతో ఐదో అంతస్తుకు వెళ్లిన శిరీష కిందకు దూకేసింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.




