ఓటరు నమోదుపై యువతకు అవగాహన కల్పించాలని.
బెల్లంపల్లి ఆర్డీవో శ్యామల దేవి.
పోటో: సమావేశంలో అవగాహన కల్పిస్తున్న ఆర్డీవో.
బెల్లంపల్లి, సెప్టెంబర్13,(జనంసాక్షి)
ఓటరు నమోదుపై ప్రజలకు ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలని బెల్లంపల్లి ఆర్డీవో శ్యామల దేవి అన్నారు. మంగళవారం బెల్లంపల్లి మండలం తాళ్ల గురిజాల రైతు వేదికలో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి బూత్ లెవల్ అధికారుల అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఓటు హక్కు కోసం నూతన దరఖాస్తులు తీసుకోవాలని, ఓటరు జాబితాలో తప్పులు ఉంటే సరిచేయాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో కుటుంబ సభ్యులు ఒక క్రమంలో వచ్చేలా చూడాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల వద్ద ఓటు హక్కు కోసం దరఖాస్తులు తీసుకొని, అట్టి దరఖాస్తులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి నూతన ఓటరు గుర్తింపు కార్డు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్థానికంగా లేని ఓటర్లను వారు నివసిస్తున్న చోటుకు బదిలీ చేయాలని సూచించారు. ఓటు నమోదుకోసం ఎన్నికల కమిషన్ పంపిణీ చేసిన పోస్టర్లను విడుదల చేశారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ కుమార స్వామి, బెల్లంపల్లి డివిజన్ లోని బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.