Friday, 6 November 2026

ఓటర్ల నమోదుతో పాటు ఇంటికి పచ్చబొట్టు

 

ఆదిలాబాద్‌,జూన్‌15(జనంసాక్షి): ఈ నెలాఖరులోగా ఓటరు నమోదు పక్రియ పూర్తి చేయాలని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ సూచించారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా నమోదు కార్యక్రమం జరగాలని అన్నారు. ఒకే ఫొటో, ఒకే పేరుతో ఉన్న జాబితాను నిశితంగా పరిశీలించాలన్నారు. బీఎల్వోలకు సూపర్‌వైజర్లు తగిన సలహాలు, సూచనలు అందించాలని తెలిపారు. స్థానికంగా ఆరు నెలల పాటు శాశ్వతంగా నివసిస్తూ అర్హత ఉన్న వారి పేర్లను ఓటరుగా నమోదు చేయవచ్చన్నారు. అర్హత ఉన్న దివ్యాంగుల పేర్లు ఓటరుగా నమోదు చేయాలని, ఆ జాబితా పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవోల నుంచి తీసుకోవాలన్నారు. అర్హ త ఉన్న ప్రతి పౌరుడూ ఓటు హక్కు కలిగి ఉండాలని అన్నారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాలో ఉన్న పేర్లు, ఆయా గృహాల్లో ఉన్న వారితో సరిచూసుకొని నివాసం లేని పేర్లను నిబంధనల మేరకు తొలగించడం, అర్హత ఉన్న 18సంవత్సరాలు నిండిన వారి పేరును ఓటరుజాబితాలో చేర్చడానికి ఫారం-6 ద్వారా వివరాలు సేకరించాలన్నారు. దీంతో ఆ గృహంలో ఇక నమోదుకు ఎవరూ లేరని పరిశీలించినట్లు గుర్తుగా ఆ ఇంటికి పచ్చబొట్టు స్టిక్కర్‌ అతికించాలన్నారు.