పోలీసులకు ఓయూ జెఎసి వినతి
హైదరాబాద్,ఆగస్టు 8(జనం సాక్షి): ఉస్మానియా యూనివర్శిటీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనను వ్యతిరేకిస్తూ కాచిగూడ ఏసీపీ నర్యయ్యకు ఓయూ జేఏసీ వినతిపత్రం అందజేసింది. ఓయూలో అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్నందున రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని ఓయూ జేఏసీ ఏసీపీని కోరింది. రాహుల్ పర్యటన రాజకీయ ఉద్దేశంతో కూడుకున్నదని ఓయూ జేఏసీ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 13, 14 తేదీల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. 14వ తేదీ మధ్యాహ్నం ఓయూ క్యాంపస్‌నుసందర్శించనున్నారని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
———————-




