హైదరాబాద్,జూలై5(జనం సాక్షి):ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెట్-2018 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. యూనివర్సిటీ గెస్ట్‌హౌజ్‌లో వీసీ రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డితో పాటు యూనివర్సిటీ అధికారులు కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఓయూ పీజీసెట్‌లో 94.67 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వీసీ తెలిపారు. పీజీ, పీజీ డిఎ/-లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 70,361 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 59,638 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 56,457 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.




