ఓ కేక్ షాపును ప్రారంభించిన సినీ దర్శకుడు శేఖర్ కమ్మల 

కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 28
ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా శుక్రవారం నాడు
మారేడుపల్లెలోని శేషాచల కాలనీలో ప్రధాన రహదారిపై ఓ కేక్ షాపును ప్రారంభించారు. బాంబేలో అత్యంత ప్రచారం పొందిన ఓ కేక్ బ్రాంచీలను తెలంగాణలో కూడా విస్తరించేసిందు గాను మా మారేడ్ పల్లి లో ఈ బ్రాంచ్ ను శ్రీ సాయి తేజా ఫుడ్స్ నిర్వాహకులు సతీష్ కుమార్ గేల్లి,శరత్ రావూరి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ఈ షాపును ప్రారంభించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, తెలియజేశారు. హైదరాబాదులో ఈ షాపు ఏడోదని త్వరలో జేఎన్టీయూ,సింధీ కాలనీ,కార్ఖానా తిరుమలగిరిలో మరో త్వరలో మూడు బ్రాంచ్లను ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో తాము ఈ షాపులను విస్తరిస్తున్నట్లు 50 షాపుల వరకు ఏర్పాటు చేస్తామన్నారు.త్వరలో బెంగళూరులో కూడా ఈ షాప్ నుప్రారంభిస్తామని అన్నారు.కేవలo వెజిటేరియన్ సంబంధించినదని,టేస్ట్ గా రుచికరంగా ఉండేలా అందిస్తామని తెలిపారు.

తాజావార్తలు