నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఆరు గేట్లు ఎత్తివేత
జుక్కల్, జూలై 28,(జనం సాక్షి),
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోనికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో శుక్రవారం ప్రాజెక్టు పన్నెండు గేట్ల లోనుంచి 2,3,4,6,7,10 వరద గేట్లు ఎత్తి దిగువ మంజీరా నదిలోనికి నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు ఈఈ సోలోమన్ తెలిపారు. ప్రాజెక్టు జలాశయంలోనికి 45 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలకు గాను17.311 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు.