సిమెంట్ లారీని ఢీకొన్న కారు: ఎస్‌ఐ మృతి
హైదరాబాద్,ఫిబ్రవరి 26(జనం సాక్షి): నగర శివార్లలోని శంషాబాద్ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్‌రోడ్డుపై వెళ్తున్న కాంక్రీట్ రెడీమిక్స్ లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఓ వ్యక్తి అక్కడికికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని దవాఖానకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. మృతుడిని పల్లె రాఘవేందర్‌గౌడ్‌గా గుర్తించారు. ఆయన మహబూబ్‌నగర్‌లోని రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నారని చెప్పారు. శంషాబాద్ నుంచి తుక్కుగూడ వైపువెళ్తుండగా శుక్రవారం అర్ధరాతి రాత్రి 2.15 గంటల సమయంలో జరిగిందని చెప్పారు. ఓఆర్‌ఆర్‌లో లారీని కారు ఢీకొన్ని ఘటనలో
ఎస్‌ఐ దుర్మరణం చెందారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సవిూపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి లారీని కారు అతివేగంగా ఢీకొంది. ఈ ఘటనలో ఎస్‌ఐ ప్లలె రాఘవేందర్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు. మహబూబ్‌నగర్ జీఆర్పీలో రాఘవేందర్ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో రాఘవేందర్ గౌడ్ సికింద్రాబాద్ జీఆర్‌పీలో ఎస్‌ఐగా పని చేశారు. ఇటీవల ఆయన బదిలీపై మహబూబ్‌నగర్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. రాఘవేందర్‌గౌడ్ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నాడని పోలీసు అధికారులు తెలిపారు. అతివేగంతోనే ఈ ప్రమాదం చోటచేసుకుంది. ఓఆర్‌ఆర్‌పై అర్ధరాత్రి 2.15 సమయంలో వేగంగా వెళ్తున్న కారు.. సిమెంట్ లోడ్ లారీని ఢకొిట్టింది. శంషాబాద్ నుంచి తుక్కుగుడా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు.. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పహాడి షరీఫ్ పోలీసులు వెల్లడిరచారు. దీంతో రాఘవేందర్‌గౌడ్ కుటుంబంలో విషాదం అలుముకుంది.




