Tuesday, 3 November 2026

పవర్‌ స్టార్మ్‌ సక్సెస్‌

భీమ్లా నాయక్‌కు చిరు ప్రశసంసలు
పవర్‌ స్టార్మ్‌ సక్సెస్‌’ అంటూ భీమ్లా నాయక్‌ సినిమా విజయం సాధించిన సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, రానా దగ్గుపాటి హీరోలుగా నటించిన భీమ్లా నాయక్‌ మూవీ సంచలనం సృష్ఠిస్తోంది. ఈ సినిమా విడుదల అయిన అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మూవీ సక్సెస్‌ సాధించడంపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ విూడియా వేదికగా భీమ్లా నాయక్‌ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నిజమైన పవర్‌ స్టార్మ్‌ సక్సెస్‌ అయినందుకు కంగ్రాట్స్‌’ అంటూ ట్వీట్‌లో పేర్కొనారు. ప్రస్తుతం చిరు చేసిన పోస్ట్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతోంది. ఇక ఈ సినిమాలో నిత్యా విూనన్‌, సంయుక్త విూనన్‌ హీరోయిన్స్‌గా నటించారు. సాగర్‌ కే చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాటలు, స్క్రీన్‌ ప్లే అందించారు. ఈ చిత్రానికి మ్యూజికల్‌ సెన్సేషన్‌ థమన్‌ సంగీతం అందించారు.