ఔషధికృత ద్రవ్యాలతో విశేష అభిషేకములు

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 21
అల్వాల్ పట్టణ కేంద్రంలోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి ప్రపంచంలో అరుదైన అత్యంత విశిష్టమైన పచ్చ ఏంరాల్డ్ తో మలచిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం కనాజిగూడ లో ప్రత్యేక శుభ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించినఆలయవ్యవస్థాపకులు కార్యనిర్వహకులు డాక్టర్ మోత్కూరుసత్యనారాయణ శాస్త్రి 32 ఔషధీకృత ద్రవ్యాలతోవిశేష అభిషేకము మోదకంలు లక్ష్మీ గణపతి మూలమంత్రంమహాలక్ష్మి హోమం నిర్వహించారు.ఈసేవలో పాల్గొన్న వారికి ఉద్యోగ వివాహసంతాన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని శాస్త్రి తెలిపారు. అదేవిధంగా26 సెప్టెంబర్ 2022 సోమవారం నుండి 5 అక్టోబర్2022 వరకు శ్రీదేవి శరన్నవరాత్రులు ఉంటాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని. తీర్థప్రసాదాలు స్వీకరించాలని భక్తులను కోరారు.అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్న ప్రసాద విరాళాలు అందించవచ్చని గోత్రం నామాలతో ఆలయ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.
Attachments area



