కటకటాల పాలైన కసాయి మనుమడు
పెద్దేముల్ సెప్టెంబర్ 03 (జనం సాక్షి)
పెన్షన్ డబ్బుల కోసం సొంత నాయనమ్మ పై విచక్షణ రహితంగా దాడి చేసిన కసాయి మనుమడు గోవర్ధన్ కటకటాల పాలయ్యాడు. గత నెల 29వ తేదీన పెద్దేముల్ మండలంలోని మంబాపూర్ గ్రామంలో యశోదమ్మను తన మనవడు అయినటువంటి గోవర్ధన్ మద్యం కోసం పెన్షన్ డబ్బులు ఇస్తావా లేకుంటే చంపేస్తానని బెదిరించి ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఆవేశంతో గోవర్ధన్ తన నాయనమ్మ అయినటువంటి యశోదమ్మను విచక్షణ రహితంగా కొట్టి బూతు మాటలు తిడుతూ కాలితో తన్ని ఆమె దగ్గర ఉన్నటువంటి 2000 రూపాయలను తీసుకొని పారిపోయాడు. నరేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గోవర్ధన్ కోసం ప్రత్యేకంగా గాలింపు జరిపి అతనిని పోలీసులు వికారాబాద్ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిందితుడు గోవర్ధన్ ను తాండూర్ రూరల్ సిఐ రాంబాబు,పెద్దేముల్ ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ సమక్షంలో మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. నిందితునిపై ఐపిసి 386,324,504,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో రిమాండ్ చేసి పరిగి జైలుకు తరలించడం జరిగింది.