కమాన్ పూర్ మండల బిజెపి కార్యవర్గం నియామకం
జనంసాక్షి, కమాన్ పూర్ : భారతీయ జనతా పార్టీ కమాన్ పూర్ మండల అధ్యక్షుడు జంగపెళ్లి అజయ్ మండల కార్యవర్గాన్ని శనివారం ప్రకటించారు. మండల ప్రధాన కార్యదర్శలుగా మల్లారపు అరుణ్ కుమార్, బర్ల సదానందం, కొయ్యడ సదానందం, ఉపాధ్యక్షులుగా దండే రమేష్, బుద్దార్తి శ్రీనివాస్, మట్ట రాజయ్య, సాగంటి లక్ష్మణ స్వామి, మండల కార్యదర్శులుగా మెదరి లింగస్వామి, కోండిల్ల తిరుపతి, కొమ్ము శ్రీనివాస్, కోశాధికారిగా గట్టు శ్రీనివాస్, యువమోర్చా అధ్యక్షులుగా పంతకని విష్వతేజ, మహిళ మోర్చా అధ్యక్షులుగా అలుగువెళ్లి కృష్ణవేణి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు గా ఆర్కుటి ఓంకార్ యాదవ్, దళిత మోర్చా అధ్యక్షులుగా సుద్దాల కృష్ణమూర్తి, కిసాన్ మోర్చా అధ్యక్షులుగా పిల్లి చంద్రయ్య లను నియమించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు మట్ట శంకర్, మచ్చగిరి రాము, జంగపెళ్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.