కరీంపేటలో గ్రామస్తులకు వైద్య సేవలు..
జ్వరాలు అదుపులో ఉన్నాయి..
ప్రతి రోగికి రక్త పరీక్షలు చేయాలి..
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 17
శంకరపట్నం మండలం కరీంపేట గ్రామంలో జ్వరాలు అదుపులో ఉన్నట్లు జిల్లా వైద్య అధికారి జుబేరియా తెలిపారు. శనివారం గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి వైద్య సేవలపై పలు సూచనలు చేశారు. అనంతరం విలేకరులతో జిల్లా వైద్య అధికారి మాట్లాడారు. గత వారం రోజుల నుండి కరీంపేట గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఇంటింటా సర్వే , వైద్య పరీక్షలు నిర్వహించి, జ్వరాలు ప్రబలిన ప్రతి వ్యక్తికి రక్త పరీక్షలు నిర్వహించి, మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వైరల్ జ్వరాలను అదుపులోకి తీసుకుని, ప్రజలకు ఎలాంటి ఆందోళన లేకుండా వైద్య సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు ప్రభుత్వ వైద్యశాల సేవలను వినియోగించుకొని మెరుగైన వైద్యము పొందాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వేణుగోపాల్, ఫార్మసిస్ట్ మతిన్, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, వైద్యశాల సిబ్బంది తదితరులు ఉన్నారు.