కరెంటు సారు కరప్షన్ కథలు.
పినపాక నియోజకవర్గం, ఆగస్టు 25 (జనంసాక్షి):-
మణుగూరు సబ్ డివిజన్ విద్యుత్ శాఖలో ఓ అవినీతి రవికిరణం అవినీతి కాంతులు ఎదజల్లుతుంది. కాసుల కోసం కక్కుర్తి పడే ఈ అవినీతి అధికారి వలన ప్రభుత్వ ఖజానాకి కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సమాచారం.
విద్యుత్ వినియోగదారుల అవసరాలను ఆసరగా చేసుకొని భారీగా సొమ్ము చేసుకుంటున్నాడో ఉన్నతాధికారి.
అక్రమ వసూళ్లకు అలవాటు పడ్డ విద్యుత్ శాఖ ఓ ఉన్నతాధికారి ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేసి భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం సేకరించిన మీడియా బృందం.పైసలిస్తే ఎంతటి కరప్షన్ కార్యానికైనా ఈ అవినీతి అక్రమార్కుడు సిద్దం అని,అమాయక ఆదివాసి సన్న,చిన్న కారు రైతుకు గొడ్డలి పెట్టులా మారిన అధికారి తీరు తెలుసుకున్న మీడియా ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో సమచారం సేకరించి
ఈ నెల 20,21 వ తేదీలలో వార్త రాశారు.గుమ్మడి కాయ దొంగ అంటే బుజాలు పట్టుకొన్నట్లుగా ఆ అధికారి వ్యవహరించాడు. రాసిన వార్త లో సదరు అధికారి పేరు కానీ,తన హోదా కానీ లేవు. వార్త
రాసిన విలేకరి కి ఫోన్ చేసి ఇష్టరీతిన
ఈ అధికారి మాట్లాడాడు.తప్పుడు రాతలు రాస్తే కేసు పెడతా అని విలేకరి పై జులుం ప్రదర్శించాడు. నిజానిజాలు సేకరించి వార్త రాయటమే తన విధి అని, బెదురులే కుండా ఆ విలేకరి సమాధానం చెప్పాడు. తాము సేకరించిన ఆధారాలని అతి త్వరలోనే విజిలెన్స్ అధికారికి అందజేయునున్నామని తెలియజేశారు.కొన్ని గంటల తరువాత తన అనుకూలమైన వారితో ఫోన్లు చేయించడం మొదలుపెట్టాడు.