కరెంట్ షాక్ తో ఎద్దు మృతి

 జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన కొడారి మల్లయ్య కు సంబంధించిన ఎద్దు ప్రమాదవ శాత్తు శనివారం విద్యుత్ షాక్ తో మృతి చెందింది. దీని విలువ సుమారు రూ. లక్ష వరకు ఉంటుందని, విద్యుత్ శాఖ అధికారులు ప్రభుత్వపరంగా సాయం అందించే ఆదుకోవాలని బాధితుడు మల్లయ్య కోరారు. నాగారం గ్రామ సర్పంచ్ బూడిద మల్లేష్ ఈ సంఘటన పై స్పందిస్తూ. . విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని , ట్రాన్స్ఫార్మర్ ని తక్కువ ఎత్తులో నిర్మించారని అందువల్ల మనుషులకు సైతం అపాయం జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. ఎంతో కాలంగా తన కుటుంబ సభ్యుని వలె పెంచుకుంటున్న ఎద్దు మరణించడం పట్ల రైతు తీవ్రమైన మనోవేదనకు గురికావడం జరిగిందని, రైతుకు నష్టపరిహారం కింద లక్ష రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ట్రాన్స్ఫార్మర్ గద్దెలను ఎక్కువ ఎత్తులో నిర్మించాలని లేనిచో మనుషులు , పశువులు, ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని విద్యుత్ అధికారులను హెచ్చరించారు.

తాజావార్తలు