తులకు రుణమాఫీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చందిరి సంజీవరెడ్డి

జనం సాక్షి దుబ్బాక దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చంద్ర సంజీవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు ఇందిరమ్మ రాజ్యము తెచ్చిన ఘనత, ఇందిరమ్మ ఇందిరమ్మ ఇల్లు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలిపారు బిఆర్ఎస్ పార్టీ రైతులను మోసం చేస్తుందని 24 గంటల కరెంటు అని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను సబ్స్టేషన్లో లాంగ్ బుక్కులు పరిశీలిస్తే 8 గంటల కంటే ఎక్కువ త్రీఫేస్ కరెంటు ఇస్తలేదని ప్రజలను మోసం చేస్తున్న పార్టీ బి ఆర్ఎస్ పార్టీ అని ఎద్దేవా చేశారు రైతులను నట్టేట ముంచిన ఈ బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని ఈ సందర్భంగా తెలిపారు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి నా ప్రభుత్వం ఇంతవరకు లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదని ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని రైతుల యొక్క గోస ఎవరికి రావద్దని రుణమాఫీ అని గద్దెనెక్కిన టిఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు దాటి నా తర్వాత కూడా రుణమాఫీ చేయని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు గడిచిన వారం రోజుల నుండి విపరీతమైన వర్షాలు కురుస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని సంజీవరెడ్డి ఎద్దేవా చేశారు వర్షాలకు ఇల్లు కూలిపోతుంటే నష్టపరిహారం ఇప్పించాలని అన్ని రకాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి పేదలకు సేవ చేస్తుందని తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ దేవత .తెలంగాణ ఇవ్వకుంటే ఈ ప్రభుత్వాలు ఎక్కడివి , రైతులకు రుణమాఫీ చేయాలని బి ఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుబ్బాక నియోజకవర్గం లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఈ సందర్భంగా జోష్యం చెప్పారు.

తాజావార్తలు