హైదరాబాద్,మార్చి8(ఆర్‌ఎన్‌ఎ): నగరంలోని కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల కర్మన్‌ఘాట్‌లో గోరక్షకులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. గోరక్షకులకు భరోసా కల్పించేందుకు కర్మన్ ఘాట్‌లో బండి సంజయ్ పర్యటిస్తున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు పాల్గొన్నారు.




