Wednesday, 4 November 2026

కల్లి కల్లు తాగి 12 మంది అస్వస్థత

మెదక్‌ : జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని పెద్ద చెట్యాల గ్రామంలో శుక్రవారం రాత్రి కల్తీ కల్లు తాగి 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఎక్సైజ్‌ సీఐ మణమ్మ కథనం మేరకు కల్లు సీసాలను సరఫరా చేశారు. అందులో బజారు సత్తయ్య అనే కల్తీ కల్లు తయారుచేసి విక్రయించగా పన్నెండుమంది అస్వస్థతకు గురయ్యారు. మంగలి సత్తవ్వ, కాకపురం బీరయ్య, ఖాసీం, కర్ర ఎల్లవ్వ, బ్యాగరి కనకవ్వ, బ్యాగరి బీరయ్య మర్కంటి దుర్గవ్వల పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయం తెలుసుక్ను దుబ్బాక ఎమ్మెల్యే చెరకు ముత్యం రెడ్డి బాధితులను పరామర్శించారు.సిద్ధిపేట ఎక్సైంజ్‌ సీఐ జావేదాలీ, దుబ్బాక సీఐ వెంకటరామయ్య, మిరుదొడ్డి ఎస్‌ఐ పరశురాం సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకొని బజారు సత్తయ్య మీద కేసు నమోదు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *