Thursday, 5 November 2026

కల్వకుంట్ల కవిత ఇంటి పై బిజెపి నాయకుల దాడిని ఖండిస్తూ కవిత ని కలిసిన యువజన విభాగం..

    సికింద్రాబాద్ (జనం సాక్షి ) :    కల్వకుంట్ల కవిత  ఇంటి పై బిజెపి నాయకుల దాడిని ఖండిస్తూ కవిత ని కలిసిన యువజన విభాగం నాయకులు.    ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బిజెపి జాతీయ నాయకత్వం అలజడి సృష్టించి  ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.   ఈ  చర్యను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని ఆలకుంట హరి టిఆర్ఎస్ యువజన విభాగం గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షులు  అన్నారు.  తెరాస   నాయకులు  ఎమ్మెల్సీ కవిత ని కలిసి తన సంఘీభావం ప్రకటించారు.   బిజెపి నాయకులు  ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన కూడా   తెరాస  యువజన విభాగం కార్యకర్తలు మీ వెంటే ఉండి మీ రక్షణ కొరకై  తెలంగాణ పోరాటం వలె బిజెపిని తరిమికొట్టే పోరాటం చేయడానికి యువజన విభాగం నాయకులు సిద్ధంగా ఉన్నామని ఆలకుంట హరి  కల్వకుంట్ల కవిత   కి తెలియజేశారు.   ఈ కార్యక్రమంలో సంతోష్,సునీల్ ముదిరాజ్, మల్లికార్జున్,టీవీ శ్రీనివాస్,అరుణ్ కుమార్,శివరాత్రి మల్లేష్,గోపాల్ రెడ్డి, విసీ లాడ్జి బస్తి ఆనంద్,మహేందర్,యాదగిరి, మొదలగున వారు పాల్గొన్నారు…