Thursday, 5 November 2026

*మూసీ ప్రత్యామ్నాయ జలాల సాధనకై సిపిఎం పోరు యాత్రను జయప్రదం చేయండి*

         *పోస్టర్ ఆవిష్కరణలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిని ఆనంద్, వైస్ యంపిపి నాగటి ఉపేందర్*
 రామన్నపేట ఆగస్టు 24 (జనంసాక్షి)
మూసీ జల కాలుష్యం నుండి విముక్తి చేయడం కోసం ప్రత్యామ్నాయంగా గోదావరి,కృష్ణ జలాలు అందించాలని డిమాండ్ చేస్తూ 28న నీర్నెముల గ్రామంలో  జరిగే సిపిఎం పోరు యాత్ర సభను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు బోయిని ఆనంద్, వైస్ యంపిపి నాగటి ఉపేందర్ ప్రజలకు పిలుపు నిచ్చినారు.
బుధవారం నీర్నెముల గ్రామంలో సిపిఎం పోరుయాత్ర పోస్టర్  ఆవిష్కరించి వారు మాట్లాడుతూ మూసి కాలకూఠ విషంగా మారిందని క్యాన్సర్, కిడ్నీ సంబంధించిన వ్యాధులు, చర్మవ్యాధులు, అబార్షన్ లు ఇతర రోగాలతో ప్రజలు ఆనారోగ్యాలకు గురవుతున్నారని మూసినీటి కి బదులుగా చేసే ప్రత్యామ్నాయ నీటి వనరుల పోరాటంలో రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని
*విష జలాల విపత్తు నుండి జనావళి* *విముక్తికి గోదావరి-కృష్ణా జలాలను వినియోగించడమే సరైన ప్రత్యామ్నాయమని గోదావరి నుండి కాళేశ్వరం పథకం ద్వారా 11.39 టిఎంసిలతో బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణం అవుతుందని ఈ ప్రాజెక్ట్ ప్రధాన కాల్వను విస్తృత పరిచి మూసీనదిలో నీరు పడకుండా  పిలాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డిపల్లి కాల్వ, బునాదిగాని కాల్వ,  ఆసీఫ్ నహార్ కాల్వ లోకి గోదావరి నీళ్ళతో మూసీ ప్రాంత చెర్వులు, కుంటలు నింపే అవకాశం ఉందని అన్నారు.
వలిగొండ మండలం గోకారం చెర్వులోకి ఫీడర్ ఛానల్ తో నీరు నింపి గోకారం చెరువు మినీ రిజర్వాయర్ చేయడం ద్వారా రామన్నపేట మండలానికి గోదావరి జలాలు అందే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి బండ జగన్మోహన్ రెడ్డి, నాయకులు బోయిని మల్లేశం,వల్లే వెంకట్ రెడ్డి, బల్లెం సత్తయ్య, నాగటి యాదయ్య,సుర్వి సత్యం,డివైఎఫ్ఐ నాయకులు బోయిని రామచంద్రం, ఏభూషి రవి, యేషబోయిన రామచంద్రం,ఆవుల లక్ష్మీ నారాయణ,నాగటి అంజయ్య, పబ్బురాజు తదితరులు పాల్గొన్నారు.