కల్వకుర్తి నియాజకవర్గం నుంచి బీ ఆర్ ఎస్ లోకి చేరికలు
మహబూబ్ నగర్ లో 14 స్థానాలు బీ ఆర్ ఎస్ గెలవాలి
పుట్టిన బిడ్డ నుంచి,వృద్ధుల వరకు అందరికీ సంక్షేమం అందుతుంది
కెసిఆర్ కిట్, చదువులకు ఆర్ధిక సాయం, పెన్షన్లు, కల్యాణలక్ష్మి, సొంత భూమి కలిగిన వారికి గృహలక్ష్మి, ఉద్యోగాలు,రైతు బందు, చేనేత మిత్ర, గొర్రెల పంపిణీ ఇలా అనేక పథకాలు అందిస్తున్నాం.76 యేళ్లు అయ్యింది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.ఇన్నేళ్లలో ఎందుకు గత ప్రభుత్వాలు ఇంటింటికి నీళ్ళు ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు,ప్రతిపక్ష పార్టీలు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారు.4వేల పెన్షన్లు, 25 గంటల కరెంట్ ఇస్తాం అంటున్నారు…..ఇన్నేళ్లు ఎందుకు ఇవ్వలేదు….ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని.ఒకాయనఅడుక్కుంటున్నడు…..బీజేపీ అధికారం లోకి వస్తె కేసిఆర్ పథకాలు కొనసాగిస్తాం అని బీజేపీ నాయకులు అంటున్నారు….కెసిఆర్ పథకాలు కొనసాగించాకా మీరెందుకు పీకడానికి…..సంపద పెంచాలి,పేదలకు పంచాలి మా నినాదం….కానీ సంపద పెంచుకొని, వెనక వేసుకోవాలి అనేది ప్రతిపక్షాల తీరు….సంచులు మోసినవాడు కూడా నీతులు పలుకుతున్నాడు….సంచులు మోసి, జైల్లో చిప్ప కూడు తిన్న వ్యక్తి రేవంత్ రెడ్డి…పిసిసి పదవి అదొక పదవా, ప్రైమ్ మినిస్టర్ పదవి అయినట్టు బిల్డప్ ఇస్తున్నాడు…..వీళ్లకు అభ్యర్థులే లేరు, వీళ్లకు ఓటు ఎలా వేస్తారు