కల్వర్టు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి

– వరంగల్ బిజెపి అధ్యక్షులు కొండేటి శ్రీధర్
వరంగల్ ఈస్ట్, జూలై 08(జనం సాక్షి):
వరంగల్ మహా నగరంలోని అండర్ రైల్వే గేట్ శాఖ రాశి కుంట వద్ద ఖైరతాబాద్ ప్రధాన రహదారి పై నిర్మాణం చేస్తున్న కల్వర్టు పనులను వెంటనే పూర్తి చేయాలని బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతకుముందు బీజేపీ వరంగల్  తూర్పు నియోజకవర్గ నాయకులు కుసుమ సతీష్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న కల్వర్టు పనుల వద్ద నిరసన కార్యక్రమం చేశారు .ఈ సందర్భంగా కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ గత రెండు నెలలుగా జరుగుతున్న పనులు పూర్తి కాక పోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు సమన్వయంతో పనిచేసి పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్, మాచర్ల రవీందర్ ,మాజీ మేయర్ రాజేశ్వరరావు, రత్నం సతీష్ ,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.