కళాకారుల సమస్యల కోసం కలిసి కట్టుగా పని చేయాలని జిల్లా సంస్కృతిక కళ సంస్థల సమాఖ్య వ్యవస్థాపకు అధ్యక్షులు ఎల్లా పోశెట్టి అన్నారు
బోయిన్ పల్లి సెప్టెంబర్ 25( జనంసాక్షి ) రాజన్న సిరిసిల్ల జిల్లా సంస్కృతి కళ సంస్థల సమాఖ్య మండల్ కమిటీ ని నూతనంగా ఎన్నుకోగా బోయినిపల్లి మండల అధ్యక్షులు మొగిలోజి లక్ష్మీరాజం ను ఏకగ్రీవంగా ఏనుకున్నారు
ఉపాధ్యక్షులుగా ల్యాగల దేవయ్య ,గౌరవాధ్యక్షులు కనపర్తి హన్మండ్లు, ప్రధాన కార్యదర్శి గా బిల్ల వెంకట నర్సు,
,కోశాధికారి గడల రవీందర్,
సంయుక్త కార్యదర్శి దూస కిషోర్ ,ప్రచార కార్యదర్శి బిల్ల శంకర్ & శ్రీపతి చంద్రమౌళి,కార్యవర్గ సభ్యులు నల్లగొండ శ్రీనివాస్, స్వర్గం శ్రీశైలం, బిల్ల జగ్గయ్య, లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నరు. ఈ సందర్భంగా ఎల్ల పోశెట్టి మాట్లాడుతు కళాకారులందరం కలిసి కట్టుగా హక్కుల కోసం పోరాడాలని ,ఐక్య మత్యంగా అందరం ఉండాలని అన్నారూ.అనంతరం నూతన కమిటీని ప్రమాణ శ్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో
రాజన్న సిరిసిల్లా జిల్లా సంస్కృతి కళ సంస్థల్ల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు యేల్ల పోశెట్టి , జిల్లా గౌరవ అధ్యక్షులు బొడ్డు రాములు , సావన పల్లె శ్రీనివాస్ జిల్లా కన్వీనర్, వనం రాజయ్య బూర్రి శంకరయ్యలు ఉన్నారు
ఈ సందర్భంగా మొగులోజి లక్ష్మీ రాజాం మాట్లాడుతూ బోయినిపల్లి మండల్ సంస్కృతి కల సంస్థల సమాఖ్య మండల కమిటీ చేసినందుకు జిల్లా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు ఈ సంస్కృతి కల బృందాన్ని ముందుకు తీసుకెళ్తామని తన నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరి కి ధన్యవాదాలు తెలిపారు.