Thursday, 5 November 2026

కవిత కోసం కెసిఆర్‌ ఢిల్లీ పర్యటనలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): నిజామాబాద్‌ ఎమ్‌.పి,తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కుమార్తె కవిత కు కేంద్రంలో మంత్రి పదవి వస్తుందో లేదో కాని, కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు ఆరంబించింది. ఇప్టపికే టిడిపి నేతలు కెసిఆర్‌పై విమర్శలు చేపట్టారు. ఎన్‌డిఎలో చేరేందుకు కెసిఆర్‌ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కుటుంబ ప్రయోజనాల కోసమే కెసిఆర్‌ ప్రధాని మోడీని కలుసుకున్నారని కాంగ్రెస్‌ నేత,మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఆరోపించారు. కవితకు మంత్రి పదవి కోసమే మోడీని కెసిఆర్‌ పొగుడుతున్నారని ఆయన అన్నారు.తెలంగాణ ప్రయోజనాల కోసం పాటు పడేవారైతే, గవర్నర్‌ వద్ద జరిగిన సమావేశంలో ఎపి నుంచి విద్యుత్‌ వాటాను ఎందుకు డిమాండ్‌ చేయలేదని ఆయన ప్రశ్నించారు.యూ టర్న్‌ తీసుకోవడంలో కెసిఆర్‌ సిద్దహస్తుడని అన్నారు.రెండు ప్రాంతాలలో సెంటిమెంట్‌ రెచ్చగొట్డడానికే ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. క ఎసిఆర్‌ విధానాలు స్వప్రయోజనాలను ఆశించి ఉంటాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *