కస్టమర్ల నమ్మకాన్ని పొందాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): నాణ్యత ప్రమాణాలు పాటించడంతో పాటు కస్టమర్ల నమ్మకాన్ని పొందినప్పుడే ఏ వ్యాపారమైన వృద్ధిలోకి ఉమ్మడి నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.గురువారం స్థానిక జనగాం క్రాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రాంబాబు దాబా హోటల్ ను వారు ప్రారంభించి మాట్లాడారు.రుచికరమైన వంటకాలను కస్టమర్లకు అందించి వారి మెప్పు పొందాలన్నారు.యువత స్వశక్తితో రాణించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జాజిరెడ్డిగూడెం జడ్పిటిసి దావుల వీరప్రసాద్ యాదవ్ , కౌన్సిలర్ అనంతుల యాదగిరి గౌడ్ , సర్పంచ్లు పారెల్లి సురేష్, శేఖర్ , రవీందర్ నాయక్ , వెంకన్న , సుంకు నాగరాజు , హోటల్  నిర్వాహకులు ఏశబోయిన రాంబాబు యాదవ్ తదతరులు పాల్గొన్నారు.