Wednesday, 4 November 2026

కాంగ్రెస్ను ఖతం చేయాలనుకున్నా నాయకులకు బుద్ధి చెప్పాలి రేవంత్ రెడ్డి

 నాంపల్లి అక్టోబర్ 12 (జనం సాక్షి ) కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు పొంది వేల కోట్లు ప్రజల ధనాన్ని వెనకేసుకున్న నాయకులే నేడు కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని చూస్తున్నారని వారికి మునుగోడు నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని దామెర, టి పి గౌరారం, నాంపల్లి,పసునూరు,ముష్టిపల్లి గ్రామాలలో ఉపఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిండి ఎత్తిపోతల పథకానికి 5 వేల కోట్ల రూపాయలను వెంటనే కేటాయిస్తామన్నారు. లక్షా ఇరవై వేల కోట్లు తో కాలేశ్వరం ని నిర్మించిన కేసీఆర్ కుటుంబం ఐదు వేల కోట్ల బడ్జెట్ తో డిండి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తే మునుగోడు నియోజకవర్గం లోనే ఫ్లోరోసిస్ తో పాటు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మునుగోడు నుండి పాల్వాయి స్రవంతి ని మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో గెలిపించాలని మునుగోడు నియోజకవర్గం గెలుపు అవినీతి నాయకులకు కనువిప్పు కావాలన్నారు. మునుగోడు నియోజకవర్గం ప్రజలు 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని నమ్మి ఇరవై రెండు వేల మెజార్టీతో గెలిపించి హక్కున చేర్చుకుంటే 22 వేల కోట్ల కాంట్రాక్టు బిజెపి అమ్ముడుపోయారనిన్నారు. ఇలాంటి వ్యక్తికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే ములుగు సీతక్క, డి సి సి జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మాధవి, దామర సర్పంచ్ దామెర యాదగిరి,టి పి గౌరారం సర్పంచ్ కొమ్ము యాదమ్మ బిక్షం, పానుగంటి వెంకటయ్య, నాంపల్లి సంజీవ, చాంద్ పాషా, గాదె పాక వేలాద్రి, కాటిక మహేష్ తదితరులు పాల్గొన్నారు.