Wednesday, 4 November 2026

కాంగ్రెస్‌ తప్పుడు విధాన ప్రకటనల వల్లే నేతలపై దాడులు : కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణపై మరిన్ని మరిన్ని సంప్రదింపులు అవసరమని షిండే, ఆజాద్‌ ప్రకటనలపై రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం మండిపడ్డారు. కాంగ్రెస్‌ తప్పుడు విధాన ప్రకటనల వల్లే ఆయా నేతల పై దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచే కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఓయూ విద్యార్థులు చేపట్టే కార్యక్రమాలకు ఐకాస పూర్తి మద్దతు ఉంటుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *