జిల్లాల్లోనూ గర్జన సభలపై ఆలోచన
హైదరాబాద్,ఆగస్ట్17(జనం సాక్షి ): కొంతకాలం పాటు రాహుల్ తెలంగాణ పర్యటన, విజయం తదితర అంశాలతో కాంగ్రెస్ ఆశలపల్లకిలో విహరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే అంశంపై ఇప్పుడు కాంగ్రెస్ జిల్లాల్లో ప్రచారం చేస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ప్రాభవం సాధించాలంటే ఏదో ఒకటి చేయాలి. ఎపిలో ప్రత్యేక¬దా బిల్లు కోసం జరగుతున్న పోరాటాల మాదిరిగానే తెలంగాణలో జిల్లాల్లో సభలతో ముందుకు పోవాలని చూస్తోంది. రాహుల్ రెండురోజుల పర్యటనతో పాటు, నిరుద్యోగ గర్జన పేరిట నిర్వహించిన సభ కాంగ్రెస్ శ్రేణుల్లో భరోసా నింపిదనే చెప్పాలి. ప్రజలకు, రైతులు,నిరుద్యోగులకు భరోసా దక్కినా దక్కకున్నా నాయకులకు, కార్యకర్తలకు మాత్రం భరోసా దక్కింది. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత వలసలను ప్రోత్సహించడంతో ఆ పార్టీ ఖాళీ అయ్యింది. దీంతో కార్యకర్తల్లో భరోసా నింపాలని ఆపార్టీ వ్యూహం రచించింది. అయితే ఇదే సమయంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతో ఆందోళన నిర్వహించి వారికి దగ్గరవ్వాలని ప్రణాళిక వేసింది. అధికారంలో ఉంటే సొంత గోల తప్ప ప్రజల గోలను పట్టించుకోవడం కూడా కాంగ్రెస్‌కు కష్టమే. కాంగ్రెస్ గత దశాబ్ద పాలనా కాలంలో పెద్దగా దేశానికి ఒరగబెట్టిందేవిూ లేదు. అంతేగాకుండా కుంభకోణాల్లో కూరుకుని పోయింది. రాష్ట్రంలో జలయజ్ఞం పేరుతో వేలాది కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసింది. ఇకపోతే ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరవాత టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరగుతున్న కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ జీర్ణించుకోవడం లేదు. ఇక్కడ కెసిఆర్ ప్రభుత్వాన్ని, అక్కడ చంద్రబాబు ప్రభుత్వాన్ని తూర్పార పట్టడమే లక్ష్యంగా సాగుతోంది. పార్లమెంటులో ప్రత్యేక¬దాపై ప్రైవేట్ బిల్లు ద్వారా లబ్ది పొందాలని చూసింది. అయితే బిజెపి ముందు పప్పులు ఉడకలేదు. నిజానికి విభజన చట్టంలో అన్ని అంశాలను పొందుపరచి, సమగ్రంగా చర్చించి వుంటే ఇవాళ ఈ గతి పట్టేది కాదు. కాంగ్రెస్ కారణంగా ప్రత్యేక¬దా పెండింగ్‌లో ఉంది. అలాగే విభజన సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. హైకోర్టు విభజనపై స్పష్టత లేకుండా పోయింది. అలాగే అసెంబ్లీ సీట్ల పెంపు అలాగే ఉండిపోయింది. నిరుద్యోగ గర్జనకు తెరాస ప్రభుత్వానికి సవాలు విసిరేలా వేలాదిమంది జనాన్ని సభకు సవిూకరించారు. పైగా జాతీయ నాయకులతోపాటు రాష్ట్ర కాంగ్రెసంతా ఇక్కడికే తరలిచ్చింది. అధికారం కోల్పోయిన తర్వాత నిరాశ నిస్పృహలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు ఈ గర్జన ద్వారా నేతలు భరోసా కల్పించారు. రుణమాఫీ ఏకకాలంగా వర్తించక పోవడంతో అయోమయంలో ఉన్న రైతులకు తామున్నామంటూ నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. ఎన్నికలకు ముందు తెరాస ఇచ్చిన హావిూలను ప్రస్తావిస్తూ వాటి అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వమే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. గర్జన విజయవం కావడంతో కాంగ్రెస్‌లో నూతనుత్తేజం నెలకొంది. అనుకున్నట్లు భారీ జనసవిూకరణ సఫలీకృతం కావడంతో నేతల్లో ఆనందం కనిపించింది. కొత్త జోష్ నింపింది. ఇక అన్ని జిల్లాలకు ఈ గర్జన సభలు విస్తరిస్తామని నేతలు ప్రకటించడంతో ప్రభుత్వ తీరుపై మరిన్ని ఆందోళనలు నిర్వహించనున్నట్లు స్పష్టమవుతోంది. నియోజకవర్గాల్లో పర్యటించి రైతుల్లో ఆత్మస్థెర్యం నింపే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు.




