కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి- తండాలో గడపగడపకు గ్యారెంటీ కార్డుల పంపిణీ
కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి- తండాలో గడపగడపకు గ్యారెంటీ కార్డుల పంపిణీ
జనంసాక్షి , కమాన్ పూర్ : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ కార్డు లను పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం భామల నాయక్ తండా మాజి ఉప సర్పంచ్ జ్యోతి శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. భామల నాయక్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని రాజీవ్ తండా లో ప్రతి గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ కార్డులు ప్రతి ఇంటికి వెళ్లి కార్డు పంపిణీ చేసి ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని ఆదరించలని.. రానున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంమే అని ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు తక్షణమే అమలు చేస్తారని వారు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులచంద్ నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ సక్లల్, గట్టయ్య, లాల్సింగ్, శ్రీను, రాజేష్,అంజనీ కుమార్,సమ్మయ్య, రాజు,జగన్, తావు,రమేష్, రమేష్,అంజి,సంతోష్,సారయ్య,చింటూ, బంటు,మరియు చిన్నమ్మ, సుశీల, మహిళలు యువకులు పాల్గొన్నారు.