కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రైతులకు 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ

* పేద ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం
* త్వరలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఆడపడుచులకు 500 కు గ్యాస్ సిలిండర్ పంపిణీ
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
మోమిన్ పేట ఆగస్టు 11 జనం సాక్షి
రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపిస్తే 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం మోమిన్ పేట మండలం కేసారం గ్రామంలో ఏర్పాటు చేసిన హాత్సే హాత్ మిలావ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ కుబేరులైన ఆదాని అంబానీ లకు వత్తాసు పలుకుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని బి ఆర్ ఎస్ బిజెపి ప్రభుత్వాలు దొందు దొందే అని ఆయన ఆరోపించారు. మండల కేంద్రంలోని కేసారం గ్రామంలో హాత్ సే హత్ మీ లవ్ అనే కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కేవలం 500 కే వంట గ్యాస్ చేయి మహిళలను ఆదుకుంటామని అన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ఎన్నికల ముందు నల్లధనాన్ని వెలికి తీస్తానని ప్రతి ఖాతాదారుని అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తామని సంవత్సరానికి నిరుద్యోగులకు కోటి ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను మర్చిపోయారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బి ఆర్ ఎస్ ప్రభుత్వం దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడు ఎకరాల భూమి, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నింటిని తుంగలో తొక్కాడని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్ముకై నిత్యవసర ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజలు ఒక్క పూట తిండి తినలేని పరిస్థితి దాపురించిందని దుయ్యపట్టారు. దళిత బంధు పథకంతో దళితులకు జీవన రేఖలు మారుస్తామన్న ముఖ్యమంత్రి ఏ ఒక్క దళితునికి ఉపయోగకరం లేకుండా చేశారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేపదవీకాలం పూర్తవుతున్న ఏ ఒక్క అభివృద్ధి పనులు చేయకపోవడం విచారకరమని అన్నారు.మండల ప్రజలను ఎన్నటికీ మర్చిపోలేనని ఏ ఆపద వచ్చినా ఫోన్ చేస్తే వెంటనే ఆదుకుంటానని అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో బి ఆర్ ఎస్, బిజెపి లను మట్టి కరిపించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని గెలిపించి దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని, వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి ప్రసాద్ కుమార్ ను బలపరచాలని ఆయనను మంత్రిగా చూడాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో వివిధ పార్టీల నుండివందమంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన్నే శంకర్ యాదవ్ మాజీ ఎంపీపీ ఒగ్గు మల్లయ్య అమ్రాది లక్ష్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పిఎసిఎస్ మాజీ చైర్మన్ సుభాష్ గౌడ్ మాజీ ఎంపీటీసీ మల్లేశం యాదవ్ వేమ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యదర్శిలు ఎజాజ్ పటేల్ మొహమ్మద్ హాజీ మా ణయ్య వెంకటేశం మైనార్టీ సెల్ అధ్యక్షుడు మొహమ్మద్ అస్లాం నరసింహారెడ్డి రామకృష్ణారెడ్డి కే సారం చంద్రయ్య నర్సింలు ఎస్సీ సెల్ అధ్యక్షుడు కృష్ణ కోస్గి జిల్లా కార్యదర్శి మా ణయ్య ఈ వెంకటేశం ఎస్ నరసింహులు సురేందర్ బాబు మహేందర్ చారి ఆయా గ్రామాల ఆయా గ్రామాల సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు