Tuesday, 3 November 2026

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేసిన బండారి ప్రకాష్ గౌడ్

 

 

బండారి ప్రకాష్ గౌడ్ సేవలు ఎప్పటికీ మరువలేనివి – డా. సత్యం శ్రీరంగం…

కూకట్ పల్లి (జనంసాక్షి) :కూకట్ పల్లి నియోజకవర్గం బాలా నగర్ లొ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కీ|| శే|| బండారి ప్రకాశ్ గౌడ్ విగ్రహా ఆవిష్కరణ సందర్బంగా బుధవారం టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ కూకట్ పల్లి నియోజక వర్గం బాలానగర్ లో కాంగ్రెస్ పార్టీ అభివృిద్దికి ఎనలేని కృషి చేసిన బండారి ప్రకాష్ గౌడ్ సేవలు మర్చిపోలేమన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పా రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు పి. నాగిరెడ్డి, బండారి నవీన్ గౌడ్, ఫతేనగర్ డివిజన్ అధ్యక్షుడు కే. రమేష్ ముదిరాజ్, రాజు ముదిరాజ్, సూరజ్ తివారి, పటేల్ శ్రీకాంత్ గౌడ్, శ్రావణ్ గౌడ్, పులి కిరణ్ గౌడ్, ముఖేందర్, మట్టే ప్రసన్న కుమార్, మహేందర్, చంటి సింగ్, హేమంత్, జావీద్ ఆలీ, గజానంద్ శేఖర్, వీరన్న, హనుమంతు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.