రామన్నపేట సెప్టెంబర్ 2 (జనంసాక్షి) రామన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి . 13వర్ధంతి సందర్భంగా మాజీ ఎంపిటిసి సాల్వేర్ అశోక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాక ఆరోగ్యశ్రీ ,108 ,ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కిసాన్ సేల్ అధ్యక్షులు మొహమ్మద్ ఎజాస్ మండల యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ జానీ, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ మెహబూబ్ అలీ, మండల కాంగ్రెస్ నాయకులు జానీ భాయ్, అయ్యాడపు నర్సిరెడ్డి , నోముల లింగస్వామి, కే కరుణాకర్, గోపాల్, నరసింహ, యాదయ్య, లక్ష్మమ్మ ,మల్లమ్మ, పద్మ, పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు




