కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టి బొమ్మ దగ్ధం

మోత్కూర్ జూలై 22 జనం సాక్షి : ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పై అక్రమంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈడి విచారణకు నోటీసులు ఇచ్చి వారి ప్రతిష్ట కు భంగం కలిగించే విదంగా వ్యవహరిస్తున్న తిరుకు నిరసనగా ఈ మోత్కూర్ మున్సిపల్ కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ ను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు వంగాల సత్యనారాయణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఈడీ ని అడ్డుపెట్టుకొని గాంధీ కుటుంబం పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడాడము హెయమైన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు అవిశెట్టి అవిలిమల్లు,మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మలిపెద్ది మల్లారెడ్డి,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు నాయిని ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు మందుల సురేష్, రాచకొండ బాలరాజు,పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీను,కరుపొతుల వెంకన్న,శేఖర చారి,వీరస్వామి,బందెల రవి,భట్టు మచ్చగిరి,రాంపాక ఉపేందర్,చల్ల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area

తాజావార్తలు