కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహరచన కమిటీ కన్వీనర్ గా ఆర్డీఆర్

సూర్యాపేట (జనంసాక్షి): ఉప ఎన్నికలు జరుగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది.మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల కాంగ్రెస్ పార్టీ ప్రచార , వ్యూహరచన కమిటీ కన్వీనర్ గా మాజీమంత్రి , టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డిని ఏఐసీసీ నియమించింది.ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ , ఎంపీ మాణిక్యం ఠాగూర్ ప్రకటన విడుదల చేశారు.